Tue Dec 24 2024 12:51:57 GMT+0000 (Coordinated Universal Time)
సెప్టంబరు 3న టీఆర్ఎస్ఎల్పీ భేటీ
సెప్టంబరు 3న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.
సెప్టంబరు 3న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్లమెంటు సభ్యులకు కూడా ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో కొత్త పింఛన్లు, పోడు భూములు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరగనుంది.
అదేరోజు కేబినెట్ భేటీ...
వచ్చే నెల 3వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత శాసనసభ పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రి వర్గ సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా దళిత బంధు పథకం అమలుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.
Next Story