Mon Nov 18 2024 18:28:07 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజూ ఈడీ ఎదుటకు మంచిరెడ్డి
లంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో మంచిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. 88 కోట్ల రూపాయలకు సంబంధించి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతి తక్కువ కాలంలో ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బ్యాంకు పత్రాలతో మంచిరెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు.
బ్యాంకు పత్రాలతో...
నిన్న తొమ్మిది గంటల పాటు మంచిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈడీ అధికారులు సంతృప్తి చెందకపోవడంతో నేడు మరోసారి హాజరుకావాలని సూచించగా ఆయన కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గతంలోనే మంచిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
Next Story