Mon Dec 23 2024 18:13:02 GMT+0000 (Coordinated Universal Time)
రెండు కిలోల బంగారం ఇచ్చిన ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కోరారు. కేసీఆర్ పిలుపుకు మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు వ్యాపారవేత్తలు ఇప్పటికే బంగారం తాపడం కోసం విరాళాన్ని ప్రకటించారు.
22 ఏళ్ల మొక్కు....
నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి యాదాద్రి ఆలయ గోపుర బంగారం తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే కుటుంబం సమేతంగా యాదాద్రిని దర్శించుకుని బంగారన్ని అందజేశారు. తన 22 ఏళ్ల మొక్కు తీరిందని ఆయన అన్నారు.
Next Story