Mon Dec 23 2024 19:43:01 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు మరోసారి విచారణకు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు మరోసారి విచారించనున్నారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు మరోసారి విచారించనున్నారు. నిన్న ఆరు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఈరోజు మరోసారి హాజరు కావాలని కోరారు. దీంతో రోహిత్ రెడ్డి ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈడీ అధికారులు రోహిత్ రెడ్డిని విచారించారు.
ఆస్తులు, వ్యాపార లావాదేవీలు...
వ్యాపార లావాదేవీలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాలపై నిన్న ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈరోజు మరోసారి ఈడీ అధికారులు హాజరు కావాలని కోరడంతో పైలట్ రోహిత్ రెడ్డిని ఏ విషయంపై అధికారులు ప్రశ్నిస్తారో అన్న టెన్షన్ పట్టుకుంది. ఆయన ఎన్నికల సందర్భంగా అఫడవిట్ లో రూపొందించిన ఆస్తుల వివరాలకు సంబంధించిన దానిపైనే ఎక్కువగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
Next Story