Mon Dec 23 2024 18:10:03 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ పై కౌశిక్ రెడ్డి కామెంట్స్ దుమారం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను అసభ్యపదజాలంతో దూషించడంపై బీజేపీ శ్రేణులు మండి పడుతున్నాయి. చెప్పలేని భాషలో కౌశిక్ రెడ్డి గవర్నర్ పై వ్యాఖ్యానాలు చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
చర్యలు తీసుకోవాలంటూ...
దీంతో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర గవర్నర్ పట్ల అమార్యదకరంగా, అసభ్యకరంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story