Thu Jan 16 2025 08:03:55 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ ఆఫీస్ లో బీపీ డౌన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బీపీ డౌన్ కారణంతో అధికారులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. రమణ అస్వస్థతకు గురికావడంతో ఈడీ అధికారులు కూడా కొంత కంగారు పడ్డారు. వెంటనే తమ సిబ్బందిని పిలిపించి ఆయనను ఆసుపత్రికి తరలించారు.
విచారణకు వచ్చిన....
ప్రస్తుతం ఎల్ రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసినో వ్యవహరంలో విచారించేందుకు ఈడీ అధికారులు ఎల్ రమణకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను అతిక్రమించారన్న కారణంగా ఆయనను విచారిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఎల్ రమణ కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
Next Story