Mon Dec 23 2024 08:31:57 GMT+0000 (Coordinated Universal Time)
రేపే టీఆర్ఎస్ ప్లీనరీ..19 తీర్మానాలను ప్రవేశపెట్టనున్న కేసీఆర్
ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం రేపు జరగనుంది. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్ లోని హెచ్ఐసీపీలో పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవ్వగా.. ప్లీనరీలో భాగంగా పార్టీ అధినోత హోదాలో సీఎం కేసీఆర్ కీలక తీర్మానాలను ప్రతిపాదించనున్నారు.
ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. ప్లీనరీ సమావేశంలో మొత్తం 19 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఈ తీర్మానాలను ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.
Next Story