Fri Dec 20 2024 18:10:27 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో నిర్ణయం తీసుకుంటాం
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు తెలిపారు
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు తెలిపారు. ఓటింగ్ లో పాల్గొనాలా? లేదా తటస్థంగా ఉండాలా? అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేకే తెలిపారు. తాము ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
టీఎంసీ మాదిరిగానే....
అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తుంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ నేత కావడంతోనే ఆలోచనలో పడింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలన్న నిర్ణయాన్నే టీఆర్ఎస్ తీసుకుంటుందని సమాచారం. ఇప్పటికే టీఎంసీ తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా అదే బాటలో పయనించే అవకాశాలున్నాయి.
Next Story