Tue Dec 24 2024 16:40:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు షాక్.. మంత్రి సోదరుడు జంప్
టీఆర్ఎస్ కు వరంగల్ జిల్లాలో షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు పార్టీని వీడనున్నారు.
టీఆర్ఎస్ కు వరంగల్ జిల్లాలో మరో షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు పార్టీని వీడనున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ లో తూర్పు నియోజకవర్గాన్ని అశిస్తున్నారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2018లో టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించినా ఆయనకు అవకాశం రాలేదు.
ఈ నెల 7న...
ప్రదీప్ రావు రేపటి నుంచి తన ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత రాజీనామా తీసుకుంటారని తీసుకున్నా, ఇప్పటికే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో సోదరుడు పార్టీని వీడటం కొంత వ్యక్తిగత నష్టమని దయాకర్ రావు చెబుతున్నారు.
Next Story