Mon Dec 23 2024 16:14:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీఆర్ఎస్ జాతీయ రహదారులపై రాస్తారోకో
ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెచ్చేందుకు నేడు టీఆర్ఎస్ జాతీయ రహదారులను దిగ్బంధనం చేయనుంది
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెచ్చేందుకు నేడు టీఆర్ఎస్ జాతీయ రహదారులను దిగ్బంధనం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో వివక్ష పాటిస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దశల వారీగా పోరాటాన్ని ప్రకటించింది. యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు జాతీయ రహదారులపై రాస్తారోకోకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
వరి ధాన్యం కొనుగోలు.....
నాగపూర్, బెంగళూరు, విజయవాడ, ముంబయి జాతీయ రహదారులపై రాస్తారోకో చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా చేపట్టనున్నారు.
Next Story