Mon Dec 23 2024 14:04:34 GMT+0000 (Coordinated Universal Time)
5న కేసీఆర్ సమావేశం.. పార్టీ ప్రకటనపై చర్చ
వచ్చే నెల 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ప్రకటనపై చర్చించనున్నారు
వచ్చే నెల 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ప్రకటనపై చర్చించనున్నారు. జాతీయ కో ఆర్డినేటర్లను కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశముంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని, ఆరోజు జాతీయ పార్టీపై తీర్మానం చేస్తారని తెలిపారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేస్తారని కూడా అంటున్నారు.
జాతీయ నేతలు...
ఐదోతేదీన జరిగే ఈ సమావేశానికి కేసీఆర్ జాతీయ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఎవరెవరు వస్తారన్నది ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ కొందరు నేతలు మాత్రం ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story