జనాల ఓటింగ్ ఎటువైపు.. మిషన్ చాణక్య సర్వే రిపోర్ట్
తెలంగాణాలో మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ
తెలంగాణాలో మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏయే పార్టీల బలం ఎంత శాతం ఉందన్నదానిపై తెలంగాణ రాష్ట్రంలో మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ సర్వే నిర్వహించింది. 14 లక్షల మందిని శాంపిల్‌గా తీసుకుని... అధ్యయనం చేపట్టి రిపోర్టు ఇచ్చింది. మొత్తం రాష్ట్ర ప్రజలు అధికార పార్టీ బీఆర్ఎస్ వైపే ఉన్నట్టు స్పష్టం చేస్తోంది.
నా రాష్ట్రం-నా ఓటు- నా నిర్ణయం పేరు మీద ఆరేళ్లుగా అధ్యయనం చేస్తున్న మిషన్ చాణక్య.. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసింది. తెలంగాణ ప్రజల మూడు ఎటువైపు ఉందన్నదానిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీఆర్ఎస్కి అత్యధికంగా 44.62 శాతం మంది మొగ్గు చూపగా, కాంగ్రెస్ 32.71, బీజేపీకి 17.6 ఓటింగ్ శాతం లభించవచ్చని మిషన్ చాణక్య వెల్లడించింది. అయితే లోక్‌సభ ఎన్నికల సమయానికి ఈ శాతాల్లో మార్పులుండవచ్చని కూడా పేర్కొంది.
పురుషుల కంటే మహిళల్లోనే బీఆర్ఎస్కి మెరుగైన ఓటింగ్ శాతం ఉన్నట్లు సర్వేలో తేలిసినట్లు మిషన్ చాణక్య తెలిపింది. అటు సామాజిక వర్గాల వారీగా కూడా ఓట్ షేర్ని లెక్క గట్టింది. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ మీదే ఆసక్తి పెరిగిందని, గోండులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీకి ఆధిక్యంగా ఉన్నట్లు కనిపించినట్లు తెలిపింది.
ఇక మైనారిటీల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్తోనే ఉన్నట్టు తెలిపింది. ముస్లిం మైనారిటీ ఓట్లలో కాంగ్రెస్‌కి 38, బీఆర్ఎస్ 48 శాతం ఓటింగ్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ పట్ల క్రిస్టియన్లలో కూడా సానుభూతి తగ్గినట్లు, తెలంగాణలో రైతుబంధు ప్రభావం పెరిగిందని, రైతాంగం ఓట్లు బీఆర్ఎస్కి ఎక్కువగా పడొచ్చని తెలిపింది. ఇక ప్రైవేట్ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి కాంగ్రెస్ పార్టీపై సానుభూతి ఉందని తెలిపింది.
ఈ రిపోర్టు ఖచ్చితమైనదని తెలిపింది. అయితే గతంలో కూడా బీఆర్ఎస్కి 78 సీట్లు వస్తాయని చెప్పామని, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కి 70 నుంచి 76 సీట్లు వస్తాయని చెబుతోఓంది. కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఈసారి బీజేపీకి కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.