Mon Dec 23 2024 15:02:26 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
80 వేలకు పైగా ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్థిక శాఖ తొలి విడతలో..
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే 80 వేలకు పైగా ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్థిక శాఖ తొలి విడతలో భాగంగా 30,453 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా రెండో విడతలో భాగంగా బుధవారం మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రెండో విడతలో భాగంగా ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలో ఎక్సైజ్, ఫారెస్ట్, అగ్నిమాపక శాఖలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ.. మిగిలిన శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అనుమతులపై దృష్టి సారించింది.
Next Story