Mon Dec 23 2024 07:33:33 GMT+0000 (Coordinated Universal Time)
ఆదివాసీలతో కలిసి భోజనం చేసిన గవర్నర్ తమిళిసై
గిరిజనుల ఆహారంలో పోషకాహార లోపాలున్నాయని, అందుకే పౌష్టికాహార లోప నివారణ, సమగ్ర అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు
కొత్తగూడెం : తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఆమె ఆదివాసీలైన కొండరెడ్లను కలిశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి, ఆ తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కొండరెడ్లను కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
గిరిజనుల ఆహారంలో పోషకాహార లోపాలున్నాయని, అందుకే పౌష్టికాహార లోప నివారణ, సమగ్ర అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే దమ్మపేట మండలంలోని పూసుకుంట, అశ్వారావుపేట మండలంలోని గోగులాపూడి గ్రామాలను దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు.
Next Story