Mon Dec 23 2024 02:14:30 GMT+0000 (Coordinated Universal Time)
వారికి రూ.లక్ష సహాయం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కాగా.. క్రైస్తవులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతగా.. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్రైస్తవ..
బీసీల మాదిరిగా మైనార్టీలకు కూడా రూ.1 లక్ష ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.
కాగా.. క్రైస్తవులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతగా.. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్రైస్తవ సంఘాలు , నాయకుల తరపున ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మణిపూర్ లో మహిళలపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ కామెంట్స్.. మొదటి విడతలో భాగంగా 2700 క్రైస్తవ కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తోన్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని, ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉంటామని పేర్కొన్నారు.
మణిపూర్ లో క్రైస్తవులను తగలబెడుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ క్రైస్తవులకు పెద్ద పీట వేస్తున్నారని కొనియాడారు. బేటి బచావో నినాదం కాదు బేటి జలావో (తగలబెట్టడం) అనే నినాదం మణిపూర్ లో వినిపిస్తుందంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. 72 ఏండ్ల మోడీ 79 రోజుల తర్వాత మణిపూర్ లో జరిగిన సంఘటన గురించి మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో మనమంతా సంతోషంగా ఉన్నామో క్రైస్తవులంతా ఆలోచించాలని రాజీవ్ సాగర్ సూచించారు.
Next Story