Sat Nov 23 2024 06:52:48 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ హైకోర్టులో షర్మిలకు ఊరట
3,500 కిలో మీటర్ల మేర ప్రశాంతంగా సాగిన షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అనుమతి నిరాకరించారని..
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాదయాత్రలో, సీఎం కేసీఆర్ పై రాజకీయ, మతపరమైన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని షర్మిలకు కోర్టు షరతు విధించింది. తెలంగాణ వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్ర నిన్న నర్సంపేటకు చేరుకుంది. అక్కడ షర్మిల కారుపై టీఆర్ఎస్ నేతలు దాడి చేయగా.. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి, లోటస్ పాండ్ కు తరలించారు.
3,500 కిలో మీటర్ల మేర ప్రశాంతంగా సాగిన షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అనుమతి నిరాకరించారని వైఎస్సార్టీపీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వరంగల్ జిల్లా లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు యాత్రపై దాడికి యత్నించారని ఆరోపించింది. ఈ పిటిషన్ పై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు... షర్మిల పాదయాత్రకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story