Sun Dec 22 2024 19:44:59 GMT+0000 (Coordinated Universal Time)
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆంక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో జనం గుంపులు గుంపులుగా గుమికూడకుండా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు, మూడ్రోజుల్లో
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్.. తెలంగాణను ఊపేస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకోగా.. నిన్న ఒక్కరోజే 14 కేసులు బయటపడ్డాయి. దీంతో హైకోర్టు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. క్రమంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు నేడు విచారణ చేసింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో జనం గుంపులు గుంపులుగా గుమికూడకుండా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు, మూడ్రోజుల్లో ఈ ఆదేశాలను జారీ చేయాలని తెలిపింది.
అలాగే విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నట్లే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు కూడా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే కోవిడ్ నిబంధనలను విధించారో.. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నిబంధనలు పెట్టాలని ఆదేశించింది హైకోర్టు.
Next Story