Sat Mar 29 2025 10:45:37 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాఫిక్ హోం గార్డును సత్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్
నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు అష్రఫ్ అలీని తెలంగాణ హైకోర్టు ప్రధాన..

హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు అష్రఫ్ అలీని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సత్కరించారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో అష్రఫ్ అలీ విధులు నిర్వహిస్తుంటాడు. అతని పనితనాన్ని గుర్తించిన జస్టిస్ సతీష్.. పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రశంసించారు. ట్రాఫిక్ హోం గార్డుగా పనిచేస్తున్న అష్రఫ్ అలీకి తన విధుల పట్ల ఉన్న నిబద్ధతను ఆయన మెచ్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులంతా ఇలా వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటే.. చాలా బాగుటుందని జస్టిస్ సతీష్ తెలిపారు.
Next Story