Fri Nov 22 2024 19:11:14 GMT+0000 (Coordinated Universal Time)
టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా
టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం
టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్- 2 పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్‌లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు సక్రమంగా ఉండేలా చూడాలని సీఎం తెలిపారు. అర్హులైన వారందరికీ సన్నద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుందని కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిలతో చర్చించారు. గ్రూప్-2 పరీక్షను నవంబర్‌కు వాయిదా వేయాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ గురించి సీఎస్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. రీ షెడ్యూల్ విషయమై టీఎస్పీఎస్సీతో చర్చించాలని సీఎస్‌ను ఆదేశించారు. లక్షల మంది విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. అంతే కాక, భవిష్యత్‌లోనూ ఉద్యోగాల నియామకాలకు విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థికి పరీక్షకు హాజరయ్యేందుకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Next Story