Sat Nov 23 2024 03:38:12 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc : 42 మందికి నోటీసులు
టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. పేపర్ లీకేజీలో మరికొందరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తుంది
టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం స్పీడ్ పెంచింది. పేపర్ లీకేజీలో మరికొందరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తుంది. ప్రధానంగాఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ తో సంబంధాలున్న వారందరినీ ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇందులో రాజశేఖర్ స్నేహితుడి పాత్ర సురేష్ పై కూడా సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సురేష్ నుంచి ఎంతమందికి ప్రశ్నాపత్రాలు అందాయన్న దానిపై సిట్ ఆరా తీస్ంతుంది.
అనేక అనుమానాలు...
టీఎస్పీఎస్సీ పనిచేస్తున్న 42 మంది సిబ్బందికి సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తున్న వారందరినీ ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. టెక్నికల్ సిబ్బంది కన్ను గప్పి ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్, రాజశేఖర్ లు ఎలా తీసుకోగలిగారన్న దిశగా దర్యాప్తు సాగుతుందని చెబుతున్నారు. వీరు మాత్రమే కాకుండా మరికొందరి హస్తం ఉండే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
Next Story