Sun Dec 22 2024 19:03:47 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc : మూడు పరీక్షలు రద్దు
ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పరీక్షలను రద్దు చేసింది
ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పరీక్షలను రద్దు చేసింది. గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ప్రశ్నాపత్రాలను దర్దు చేసింది. ఇప్పటికే ఏఈఈ, డీఏవో పరీక్షకు రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాలు లీకయినట్లు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం పరిశోధనలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఆందోళనలు ఉధృతంగా...
ఇప్పటికే విపక్షాలన్నీ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగాయి. తెలంగాణలో నిరుద్యోగ యువత కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. లీకేజీ అసలు కారకులు ఎవరన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతుంది. కాగా ప్రవీణ మొబైల్ ఫోన్ లో రాజకీయ నేతల ఫోన్ నెంబర్లు కూడా ఉండటంతో ఆ దిశగా కూడా విచారణ కొనసాగిస్తున్నారు.
Next Story