Mon Dec 23 2024 09:14:10 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో జరిగే పరీక్షలను యధాతధంగా నిర్వహించాలని నిర్ణయించింది.
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీతో కొంత అప్రమత్తమయింది ఏప్రిల్లో జరిగే పరీక్షలను యధాతధంగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పరీక్షలకు ప్రశ్నాపత్రాలను మార్చాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ప్రశ్నాపత్రం లీకు కావడంతో ఏఈ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ మిగిలిన పరీక్షలు కూడా తిరిగి నిర్వహించాలా? లేదా? అన్న ఆలోచనలో ఉందని చెబుతున్నారు.
ప్రవీణ్ మొబైల్లో...
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నిందితుడు ప్రవీణ్ మొబైల్ లో ఐదు ప్రశ్నాపత్రాలున్నట్లు సిట్ అధకారులు గుర్తించారు. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులకు సమాచారం అందించడంతో మరో నాలుగు విభాగాల ప్రశ్నాపత్రాలను మార్చాలని కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు.
Next Story