Mon Dec 23 2024 00:19:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుసార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరి కొన్ని పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం అరవై పోస్టులను అదనంగా కలుపే అవకాశాలున్నాయి.
రెండు సార్లు...
ఇప్పటికే రెండు సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ ను దర్దు చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ మళ్లీ రద్దు చేసింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేసే అవకాశముంది. గతంలో ప్రశ్నాపత్రం లీకు కావడంతో పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Next Story