Mon Dec 23 2024 14:01:34 GMT+0000 (Coordinated Universal Time)
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం
మరికొంతమంది ఈ కేసులో తప్పించుకోలేని తెలుసుకున్న తర్వాత సిట్ అధికారుల ఎదుట లొంగిపోతున్నారు. అలాగే మరో 15 మంది..
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ కేసులో సిట్ అధికారులు 90 మందికి పైగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా సిట్ అధికారులు ఇంకా ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. తీగ లాగితే డొంక మొత్తం కదలి వచ్చినట్లుగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న కొద్ది ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరూ మెల్లిమెల్లిగా బయటపడుతున్నారు. అంతేకాకుండా పేపర్ లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న వారందరూ తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రమేయం ఉన్న ఓ భార్య భర్తలు కూడా సిమ్ కార్డులు మార్చి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన భార్య భర్తలు వారి సిమ్ కార్డులను మార్చి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
మరికొంతమంది ఈ కేసులో తప్పించుకోలేని తెలుసుకున్న తర్వాత సిట్ అధికారుల ఎదుట లొంగిపోతున్నారు. అలాగే మరో 15 మంది ఈ కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజీ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ అధికారులు తేల్చారు. ఈ ప్రవీణ్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి సిస్టం నుండి టీఎస్పీఎస్సీ పరీక్షకు సంబంధించిన పేపర్ ను తీసుకున్నాడు. శంకర్ లక్ష్మి డైరీలో ఉన్న పాస్వర్డ్, యూసర్ నేమ్ ద్వారా పేపర్ లీకేజీ జరిగినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సిట్ అధికారులు ఈ నెలాఖరులో మరో 10 మందిని అరెస్టు చేయనున్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందగానే రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ అధికారులు సిద్ధమైనట్లుగా సమాచారం.
Next Story