Tue Dec 24 2024 00:15:44 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేపటి నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం
సంక్రాంతి పండగ కోసం గ్రామాలకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది
Telangana:సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగ కోసం 4,484 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రేపటి నుంచి ఈ స్పెషల్ బస్సులు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం బయలుదేరనున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకూ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఏపీతో పాటుగా...
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అత్యధికంగా ఈ సర్వీసులను నడుపుతంది. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు ఈ సర్వీసులను నడుపుతున్నామని చెబుతున్నారు. దీంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు కూడా స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దుల వరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది.
Next Story