Mon Dec 23 2024 03:14:36 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ధరలు తగ్గాయ్
హైదరాబాద్ లో ప్రయాణించే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్ పాస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లో ప్రయాణించే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడంతో టీఎస్ఆర్టీసీ ధరలను తగ్గించింది. ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర 2,530 రూపాయలుండగా, దానిని హైదరాబాద్ ప్రయాణికుల కోసం కేవలం 1900రూపాలకే అందిస్తుంది.
భారీ తగ్గింపు...
అంటే ఒక్కొక్క పాస్ పై ఆరు వందల ముప్పయి రూపాయలు ధర తగ్గించింది. ఈ పాస్ తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లోనూ ప్రయాణించే వీలుంది. హైదరాబాద్ లోని అన్ని ఆర్టీసీబస్ పాస్ కేంద్రాల్లో ఈ పాస్ లు ఇస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. తగ్గించిన ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ పాస్ తో ఎయిర్ పోర్టులో నడిచే పుష్కక్ ఏసీ బస్సులో మాత్రం ప్రయాణించేందుకు వీలులేదని స్పష్టం చేసింది.
Next Story