Sat Nov 23 2024 02:03:13 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి పెరిగిన టీఎస్ఆర్టీసీ ఛార్జీలు
ఇప్పటికే రెండు దఫాలుగా నేరుగా బస్సు ఛార్జీలను పెంచిన టీఎస్ఆర్టీసీ ఇటీవలే డీజిల్ సెస్ పేరిట మరోమారు..
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ ఇప్పటికే పలురకాల సేవల పేరుతో పలుమార్లు ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఇంధనం రేట్లు పెరిగాయని, చిల్లర సమస్య ఉండకూడదని ఇలా పలు కారణాలతో ఛార్జీలు పెరిగాయి. తాజాగా మరోమారు ఆర్టీసీ ఛార్జీలను పెంచింది టీఎస్ఆర్టీసీ సంస్థ. ఈ మేరకు శుక్రవారం ప్రకటించింది. అయితే ఈసారి అన్ని బస్సులపై ఛార్జీలు పెంచలేదు.
రిజర్వేషన్ టికెట్లపై ఛార్జీలను మాత్రమే పెంచుతున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఒక్కో రిజర్వేషన్ టికెట్ పై రూ.20 నుంచి రూ.30 వరకూ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా నేరుగా బస్సు ఛార్జీలను పెంచిన టీఎస్ఆర్టీసీ ఇటీవలే డీజిల్ సెస్ పేరిట మరోమారు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. అలాగే.. పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసుల్లో కనీస చార్జీని రూ.10లకు పెంచుతూ కూడా సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా రిజర్వేషన్ ఛార్జీలు కూడా పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరుసగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు, విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Next Story