Mon Dec 23 2024 11:13:15 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ. 5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ మూడో స్టేజీల నుంచి రూ. 5 చొప్పున
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఎలాంటి ప్రకటన లేకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో.. బస్సెక్కిన ప్రయాణికులు షాకవుతున్నారు. గురువారం రాత్రి ఉన్న ఛార్జీలు.. శుక్రవారం తెల్లవారుజాముకి పెరగడంతో అవాక్కవుతున్నారు. ప్రతి 2 నుంచి 6 కిలోమీటర్లకు రూ. 5 పెంచారు. ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు, మెట్రోలో మొదటి 2 స్టేజీల వరకు ధరలను యదాతథంగా ఉంచారు. అయితే సాధారణ ఛార్జీలు కాకుండా.. సేఫ్టీ రూపంలో వాటిని పెంచడం విశేషం. ప్రమాదాలు, వాహనాల బీమా, విపత్తులు తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూల నిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ. 5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ మూడో స్టేజీల నుంచి రూ. 5 చొప్పున పెరిగాయి. పల్లె వెలుగు బస్సుల్లో 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 13 చార్జీ ఉంటే.. దానిని రూ.15కి పెంచారు. అదే బస్సులో 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రూ.21 ఉన్న ధరను రూ.20గా నిర్ణయించారు. ఒక స్టేజీలో రూపాయి తగ్గించి.. మరో స్టేజీలో రెండు రూపాయల మేర ఛార్జీలను పెంచారు. సిటీ ఆర్డినరీ బస్సులో ఐదో స్టేజీ నుంచి రూ.20, ఆరో స్టేజీలో టికెట్ తీసుకుంటే.. రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. ఆరో స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు ఇదే ధర వర్తించనుంది. పదో స్టేజీలో టికెట్ ధర రూ. 25 ఉండగా.. దానిని ఏకంగా రూ. 30కి పెంచేశారు.
Next Story