Mon Dec 23 2024 02:36:46 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయాణికులకు గమనిక.. HYD-VIJ రెగ్యులర్ సర్వీసులు నిలిపివేత
అందుకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు..
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను TSRTC రద్దు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అందుకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని.. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించవచ్చని సూచించారు.
Next Story