Mon Dec 23 2024 16:39:56 GMT+0000 (Coordinated Universal Time)
వడదెబ్బకు ఇద్దరు మృతి
తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మరణించారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది
తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మరణించారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడదెబ్బ మృతులు కూడా ఎక్కువవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మరణించారు. ఉట్నూరు మండలం పులిమడుగులో ఒకరు, కొమురం భీం జిల్లాలో కాగజ్నగర్ లో ఇబ్రహీం అనే చిరు వ్యాపారి మరణించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో వడదెబ్బకు ఐదుగురు మరణించారు.
ఆదిలాబాద్ జిల్లాలో...
ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలను మించి నమోదవుతుండటంతో ప్రజలు ఎండదెబ్బకు విలవిలలాడిపోతున్నారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు. ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
Next Story