Sun Dec 22 2024 23:48:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఎయిర్పోర్టుకు వెళుతూ నదిలో కొట్టుకుపోయిన కారు.. తండ్రీకూతుళ్లు?
హైదరాబాద్లోని విమానాశ్రయానికి వెళుతూ కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు.
హైదరాబాద్లోని విమానాశ్రయానికి వెళుతూ కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు. ఇందులో ఒక యువతి మృతదేహం లభించింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి తండాకు చెందిన తండ్రీ కూతుళ్లు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని ఎయిర్పోర్టుకు కారులో బయలుదేరారు. అయితే మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వెలుతున్న వరదనీరు వరదప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.
వాగు దాటుతుండగా....
గంగారం తండాకు చెందిన వీరిద్దరూ పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు వద్ద తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి నీటిలోకి కొట్టుకుపోయింది. తమ కారు వాగులోకి కొట్టుకు పోయిందని, తమ మెడ వరకూ నీరు వచ్చిందంటూ సమీప బంధువులకు ఫోన్ లు చేసి చెప్పారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కొద్ది సేపటికే వారి ఫోన్లు స్విచ్చాఫ్ రావడం.. కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనలో ఉన్నాు. అయితే అయితే యువతి అశ్విని మృతదేహం లభ్యమయింది. తండ్రి మోతీలాల్్ ఆచూకీ మాత్రం తెలియలేదు.
Next Story