Mon Dec 23 2024 11:25:02 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, కొలాన్ పల్లి శివారులో గాలిదుమారానికి చెట్టు విరిగి రోడ్డుపై పడింది. ఈ విషయం గమనించకుండా..
తెలంగాణలోని రెండు జిల్లాల్లో రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, కొలాన్ పల్లి శివారులో గాలిదుమారానికి చెట్టు విరిగి రోడ్డుపై పడింది. ఈ విషయం గమనించకుండా ఓ ఆటో అతివేగంగా వచ్చి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుమార్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పెద్ద కొడప్ గల్ మండలం జగనాథ్ పల్లి 161 జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోగా క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది క్రేన్ సహాయంతో డ్రైవర్ ను బయటకు తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరా మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన సతీష్, అభిజిత్ లుగా గుర్తించారు.
Next Story