Mon Dec 23 2024 16:42:56 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. పండుగ వేళ ప్రాణం తీసిన పల్లీలు
చీకటిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల సైదులు, శైలజ దంపతులు ఆదివారం బంగారు మైసమ్మ దేవాలయం వద్ద బంధుమిత్రులతో
పండుగ వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. బంధువుల ఇంట్లో పండుగ జరుపుకునేందుకు కొడుకుతో కలిసి వెళ్లిన ఆ దంపతులకు కడుపుకోతే మిగిలింది. రెండున్నరేళ్ల బాలుడు పల్లీలు తింటుండగా.. అవి గొంతులో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చీకటిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల సైదులు, శైలజ దంపతులు ఆదివారం బంగారు మైసమ్మ దేవాలయం వద్ద బంధుమిత్రులతో కలిసి పండగ చేసుకోవాలకున్నారు. ఈ మేరకు తమ సన్నిహుతులు, బంధుమిత్రులను ఆహ్వానించారు.
Also Read : మరోసారి ఆస్పత్రిలో చేరిన కమల్ ?
ఈ వేడుకకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో ఉంటోన్న శైలజ సోదరి రేణుక, భర్త మల్లేశ్ రెండేళ్ల కుమారుడు అద్విత్ ను తీసుకుని చీకటిగూడెంకు వచ్చారు. పిలిచిన వారంతా రావడంతో.. శైలజ దంపతులు చాలా సంతోషపడ్డారు. అంతమంది ఒకచోటే చేరి సంతోషంగా ఉండటాన్ని చూడలేకపోయింది విధి. అందరూ పండగ ఏర్పాట్లలో ఉండగా బాలుడు అద్విత్.. వంటింట్లో ఉన్న పల్లీలను తీసుకుని ఒక్కసారిగా నోటిలో వేసుకున్నాడు. అవి గొంతులో ఇరుక్కోవడంతో బాలుడికి ఊపిరాడలేదు. గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
Next Story