Mon Dec 23 2024 13:43:22 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు ఇక అంతా మంచే
శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లో జరుగుతున్నాయి.
శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లో జరుగుతున్నాయి. తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని పంచాంగ పఠనంలో చెప్పారు. బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ పఠనం చేశారు. తెలంగాణలో వర్షాలు పడతాయని, పంటలు బగా పండుతాయని తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం అని పంచాంగం కూడా చెబుతుందని బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. పాలన పరంగా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆయన పంచాంగ పఠనంలో చెప్పారు.
హాజరైన మంత్రులు.. అధికారులు...
తెలంగాణలో ఈ ఏడాది అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. ఇంటా, బయటా మహిళల ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి సాహసోపేతమైన నిర్ణయాలు వెలువడుతాయని తెలిపారు. జనహిత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది పురాస్కారాలను అందచేశారు. సన్మానించారు.
Next Story