Fri Dec 27 2024 11:56:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangna : నిరుద్యోగులకు గుడ్ న్యూస్... నేడు జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు నేడు గుడ్ న్యూస్ వినపడనుంది. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది.
తెలంగాణలో నిరుద్యోగులకు నేడు గుడ్ న్యూస్ వినపడనుంది. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేడు జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయనున్నారు. నిరుద్యోగులు ఎన్నాళ్లగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకోసం అంతా సిద్ధం చేసింది.
ఏ పోస్టులు...?
నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఏ ఏ పోస్టులను ఎన్ని పోస్టులను ఏ శాఖకు చెందిన పోస్టులను భర్తీ చేస్తారన్న విషయం నేడు జాబ్ క్యాలెండర్ లో చెప్పనున్నారు. జాబ్ క్యాలెండర్ ముందుగా విడుదల చేస్తే దానికి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే అవకాశముంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమయింది.
Next Story