Mon Dec 23 2024 09:53:54 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేవంత్ నివాసానికి కేంద్ర మంత్రి పియూష్ గోయల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి స్వాగతం పలికారు.
మర్యాదపూర్వక భేటీ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చర్చించారు.
Next Story