Mon Dec 23 2024 09:10:39 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి హరీశ్‌రావుకు నిర్మలాసీతారామన్ కౌంటర్
మంత్రి హరీశ్ రావు విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు
మంత్రి హరీశ్ రావు విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ 2021 వరకూ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. రాజీనామా సవాళ్లను ప్రజలు గమనిస్తున్నారన్న నిర్మలమ్మ మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడతారో విని జాగ్రత్తగా స్పందించాలని కోరారు. ప్రతి పథకంలోనూ కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని ఆమె తెలిపారు. నిధులు పక్క దారిపట్టకుండా తమ ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
హైదరాబాద్ నుంచే...
తెలంగాణలో 55 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదిలాబాద్ ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపీ పేరు పెడతారా? అని హరీశ్ రావుకు ప్రశ్న వేశారు. కేంద్ర నిధులు వాడుకున్నప్పుడు పేరు పెట్టడానికి అభ్యంతరమేమిటని ఆమె ప్రశ్నించారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తామని ఆమె తెలిపారు. ఒక రాష్ట్రానికి ఎక్కువ, మరో రాష్ట్రానికి తక్కువ ఇవ్వరన్నారు. ఏ కారణంతో సెస్ ను వసూలు చేశారో వాటి కోసమే ఖర్చు చేయాలని నిర్మలా సీతారామన్ అన్నారు. సెస్ ల పేరుతో వసూలు చేసే రాష్ట్రానికే వెళుతాయన్నారు.
Next Story