Mon Dec 23 2024 13:58:57 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మలకు కవిత సూటి ప్రశ్న
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎమ్మెల్సీ కవిత కీలకమైన ప్రశ్నలు సంధించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎమ్మెల్సీ కవిత కీలకమైన ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్ లో ఆమె నిర్మలా సీతారామన్ ను పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని ఆమె కోరారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలని కవిత ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.
ఎందుకు అమ్ముతున్నారు?
ఎల్ఐసీని అమ్ముతుంది దేశం కోసమా? ఎవరి కోసం? అని ప్రశ్నించారు. దేశం అంటే మట్టి కాదని, ఎల్ఐసీని అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదముందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని కవిత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు.
Next Story