Sun Dec 22 2024 21:20:11 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : కవిత అరెస్ట్పై స్పందించిన అమిత్ షా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు
Amit Shah :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. చట్టం తన ప్రకారం తన పనితాను చేసుకుపోతుందన్నారు. ప్రభుత్వం చెబితే దర్యాప్తు సంస్థలు పనిచేయవన్న అమిత్ షా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొన్నేళ్ల నుంచి ఈడీ, సీబీఐలు విచారిస్తున్నాయన్నారు. ఎన్నికలు వచ్చాయి కదా? అని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయవని, అరెస్ట్ చేయకుండా ఆగవని అన్నారు.
రాజకీయ ఆరోపణలు అంటూ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత విషయంలో రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్షతోనే కవితను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. దీనికి అమిత్ షా ధీటుగా సమాధానమిచ్చారు. దర్యాప్తు సంస్థలు లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే అరెస్ట్ చేస్తారని, హోంమంత్రి చెబితే చేయరని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story