Mon Dec 23 2024 08:09:41 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి ఈటల వద్దకు అమిత్ షా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య మరణించడంతో ఆయన ఇంటికి షా వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మల్లయ్య చిత్రపటం వద్ద అమిత్ షా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా వివిధ కార్యక్రమాలతో బీజీగా ఉన్నారు. అయినా శామీర్ పేటలో ఉన్న ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ప్రత్యేకంగా సమావేశం...
ఇటీవల ఈటల రాజేందర్ ను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం వంటి అంశాల గురించి కూడా అమిత్ షా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా కొద్దిసేపు షా సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో పాటు మునుగోడు ఉప ఎన్నికపైన కూడా అమిత్ షా చర్చించినట్లు తెలిసింది. అమిత్ షా వెంట బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.
Next Story