Mon Dec 23 2024 07:20:14 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ తో భేటీ కానున్న అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 16వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఆయన తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొంటారు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 16వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఆయన తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొంటారు. అయితే ముందుగా హీరో ప్రభాస్ తోనూ, కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోనూ అమిత్ షా భేటీ కానున్నారు. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతి పట్ల ఆయన కుటుంబాన్ని అమిత్ షా పరామర్శించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పరామర్శకే...
ప్రభాస్ తో కూడా భేటీ కూడా కేవలం పరామర్శకేనని అంటున్నాయి పార్టీ వర్గాలు. బీజేపీ నేతలు ఇటీవల వరసగా సినీ హీరోలతో సమావేశం అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జూనియర్ ఎన్టీర్ ను అమిత్ షా కలవగా, నితిన్ ను జేపీ నడ్డా కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో కూడా అమిత్ షా భేటీ రాజకీయంగా జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే కేవలం పరామర్శ వరకే అమిత్ షా పరిమితమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story