Mon Dec 23 2024 07:51:28 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : నేడు హైదరాబాద్కు అమిత్ షా
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా నోవాటెట్ హోటల్ కు చేరుకుంటారు. అనంతరం భాగ్యలక్ష్మి ఆలయంలో వద్దకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
పార్టీ సమావేశంలో...
అనంతరం అమిత్ షా పార్టీ సమావేశానికి హాజరవుతారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై కూడా అమిత్ షా సమీక్షించనున్నారు. ఈ సమాేవశానికి బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తో పాటు రాష్ట్ర నేతలు కూడా హాజరు కానున్నారు.
Next Story