Sun Dec 22 2024 21:44:00 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah : నేడు హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న షా మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.45 గంటల వరకూ ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగే బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొననున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపై జనాలకు చేరేవేసేందుకు పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.25 వరకూ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు.
నేతలకు మార్గదర్శనం...
ఈ కార్యక్రమంలో పార్టీ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులతో పాటు మండల, జిల్లా కమిటీల నాయకులు కడా పాల్గొంటారు. వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకూ హోటల్ ఐటీసీ కాకతీయలో బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈసారి పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను దక్కించుకునేలా సమన్వయంతో చేయాలని వారికి హితబోధ చేయనున్నారు. తిరిగి సాయంత్రం అమిత్ షా బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షా రాక సందర్భంగా ఆయన ప్రయాణించే రూట్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story