Mon Dec 23 2024 08:09:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సూర్యాపేటకు అమిత్ షా
ఈరోజు సూర్యాపేటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. బహిరంగ సభలో ప్రసగించనున్నారు
తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించిన బీజేపీ రెండో విడత జాబితాను కూడా సిద్ధం చేసింది. రేపో, మాపో రెండో విడత జాబితాను విడుదల చేయనుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సూర్యాపేటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. బహిరంగ సభలో ప్రసగించనున్నారు. కొందరు ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని తెలిసింది.
బహిరంగ సభలో...
నిన్న రాత్రే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. 75వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ పాల్గొన్న తర్వాత ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్లో సూర్యాపేటకు బయలుదేరి వెళతారు. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేయనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు బేగంపేట్ నుంచి తిరిగి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story