Wed Dec 18 2024 22:44:00 GMT+0000 (Coordinated Universal Time)
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.నిజంగా రుణమాఫీ చేస్తే..రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ లోకి కేసీఆర్ వెళ్తారా?
రేవంత్ ఏబీవీపీ నుంచి వచ్చారు కాబట్టి..బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్అంటున్నారని,కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారని, ఆయన కాంగ్రెస్లోకి వెళ్లిపోతున్నారా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్న బండి సంజయ్ కాంగ్రెస్లో కొందరు సొంతబలం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా బలపడాలని..ఎమ్మెల్యేల కొనుగోలుకు సిద్ధమయ్యారనాబండి సంజయ్ అన్నారు.
Next Story