Wed Dec 18 2024 20:21:07 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay : హైదరాబాద్ లో కూల్చే ఇళ్లన్నీ హిందువులవే
హైదరాబాద్ లో కూలుస్తున్న ఇళ్లన్నీ హిందువులవేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్ లో కూలుస్తున్న ఇళ్లన్నీ హిందువులవేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తలగోక్కుంటుందని విమర్శించారు. హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ ఈ కారణంగా పేదలు రోడ్డున పడవద్దని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల కారణంగా పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఖాయమన్నారు.
వైఎస్ జగన్ కు ఆ దమ్ముందా?
తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్న బండి సంజయ్, హిందువులపై, తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడిన జగన్ మరింత అపవాదును మూటగట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దళితులకు గుడి ప్రవేశం ఇవ్వలేదని, అదే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారని విమర్శించారు. మదర్సాలపై మాట్లాడే అర్హత ఒవైసీకి లేదన్నారు. పాత బస్తీకి ఇప్పటి వరకు కొత్త బస్తీగా ఎందుకు మారలేదని ప్రశ్నించారు.
Next Story