Sun Dec 22 2024 21:55:49 GMT+0000 (Coordinated Universal Time)
BJP : బండి సంజయ్ కీలక కామెంట్స్.. ఆ రెండు పార్టీలూ
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కూరుకుపోయాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కూరుకుపోయాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరదీసిందని బండి సంజయ్ తెలిపారు. జీతాలకే పైసల్లేవంటున్నారని, మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న బండి సంజయ్ ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే...ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలనా అంటూ నిలదీశారు.
అవినీతికి పాల్పడుతూ...
అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు నాడు పాల్పడిందని, హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీసిందని బండి సంజయ్ ఆరోపించారు. పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామన్నారు. ప్రజలకు బీజేపీ ఆయుధం కాబోతోందన్న బండి సంజయ్ ప్రజలకు తమ ప్రాణాలను అడ్డుపెడతామని తెలిపారు. తమ ప్రాణాలు తీశాకే... ప్రజల ఇండ్లపై దాడులకు వెళ్లాలని ఆయన హెచ్చరించారు. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేతో సహా కుటుంబ పార్టీల్లో కార్యకర్తలకు ముఖ్య పదవులివ్వగలరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Next Story