Mon Dec 23 2024 03:44:44 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay : తిరుమల లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు
తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. దోషులను ఎవరినీ వదిలేదని ఆయన అన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం అనేది దుర్మార్గపు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కోరితే...?
రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమకు నమ్మకం ఉందని, అయితే ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిస్తుందన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలపెట్టేది లేదన్నారు. తిరుమలలో ఇంతటి అరాచకాలకు పాల్పడితే ఎవరూ క్షమించరని, ఇంతటి నేరానికి పాల్పడిన వారిని వదిలేదని బండి సంజయ్ తెలిపారు.
Next Story