Sun Dec 22 2024 13:40:08 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay : కేటీఆర్ ఏం బతుకు నీది?
గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేయాలని తాము కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు
గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేయాలని తాము కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షను రీషెడ్యూల్ చేయాలని మాత్రమే అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులతో చర్చలు జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గ్రూపు అభ్యర్థులను వాడుకుని బయటకు వెళ్లగొట్టారని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిగ్గుమాలిన మాటలు...
తాను గ్రూప్ వన్ పరీక్షలు లీక్ చేశానని కేటీఆర్ అన్నాడని, ర్యాలీలోకి వచ్చి విధ్వంసం చేయాలని కుట్ర పన్నారని అన్నారు. కేటీఆర్ నీ బతుకెంతో అందరికీ తెలుసునని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకటి కాకుంటే జువ్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చలేదని బండి ప్రశ్నించారు. కేటీఆర్ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, కేటీఆర్ చీకటి బతుకులు ఎవరికి తెలయవంటూ ఎద్దేవా చేశారు. జీవో 29తో అన్యాయం జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.
Next Story