Sun Dec 22 2024 21:42:54 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్, రేవంత్లపై బండి సంజయ్ ఫైర్
కేటీఆర్, రేవంత్ రెడ్డిలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండి పడ్డారు
కేటీఆర్, రేవంత్ రెడ్డిలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండి పడ్డారు. ఇద్దరూ రాజకీయంగా ఒకటేనని అన్నారు. ఇద్దరివీ ఒకటే దారులని ఆయన అన్నారు. ఉదయం రేవంత్ రెడ్డిని విమర్శించే కేటీఆర్ సాయంత్రం సెటిల్ చేసుకుంటారని బండి సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డిని కాపాడుతుంది కేటీఆర్ మాత్రమేనని, బీజేపీ కాదని ఆయన అన్నారు.
భవిష్యత్ లేదు..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న హిందూ ఆధ్యాత్మిక, సేఫా ఫౌండేషన్ లో జరుగుతున్న సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవలేదన్నారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని బండి సంజయ్ తెలిపారు. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు కూడా ఆ పార్టీ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేవారు. కేటీఆర్ నోటీసులకు తాను రిప్లై ఇచ్చినా దానిపై ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కాయని, మోదీపై ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story